History

ఇరవై సంవత్సరాల క్రితం (1989) సాలూరు GOVT.HIGH SCHOOL/COLLEGE లో 10th/INTER చదివిన బాల్య స్నేహితులంతా 2008 MAY నెల లో ఒక రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చూడడానికి కలిసేము . అప్పుడే , అదే గ్రూపు లో ఉన్న ఒక స్నేహితుడు , అప్రయత్నంగా, తన జీవన నౌక ఒడిదుడుకులను దాచుకోలేక ఇంతమంది స్నేహితులను చూడగానే ,బయటకు చెప్పుకొని బాధపడ్డాడు .వెంటనే , అప్పటికప్పుడే అతని ఆర్ధిక సమస్యలను కొంతవరకు తీర్చగలిగి ,ఐకమత్యమే మహాబలమని నిరూపించాగలిగాము .అదే రోజు ,అందరం ఒక నిర్ణయం తీసుకొని ,మాలో మేము ఒకరికొకరు సహకరించుకొంటూ , మా school / college లో చదివే విద్యార్ధులకు, పేద విద్యార్ధులకు , school/college కి మేము ఏదైనా చేయగలమా అని కూడా ఆలోచించేము.
ఫలితంగా 23-10-2008 తేది న salur old friends' association (SOFA) ను 20 మంది స్నేహితులతో ఏర్పాటు చేసేము .తే 7-06-2009 ది న విజయనగరం లో 30 మంది స్నేహితులతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి ,భవిష్యత్ లో SOFA ఏ ఏ కార్యక్రమాలు చేయాలి , కావలసిన ఆర్థిక వనరులు ఎలా ప్రోగు చేసుకోవాలో చర్చించాము .మరి కొంత మంది పూర్వ విద్యార్ధుల CONTACT NUMBERS సంపాదించి , మరింత విపులంగా చర్చించుటకు , ఒక వ్యవస్థ ను ఏర్పాటు చేయుటకు తే . 27-12-2009 ది. న ONE - STEP (ఒక్క అడుగు ) అనే పేరుతొ పూర్వ విద్యార్ధుల సభ ను G.J.COLLEGE ఆవరణ లో 60 మంది తో నిర్వహించేము .  వీరిలో TEACHERS, DOCTORS, BUSINESSMEN, MOTOR FIELD STAFF, LAWYERS, SOFTWARE ENGINEERS, LECTURERS, ARCHITECTS, BANKING, INSURANCE PROFESSIONALS గా ఎదిగిన వారు వున్నారు. AMERICA, LONDON మొ. దేశాలలో స్థిరపడినవారు వున్నారు .ఆరోజే వీరందరితో చర్చించి ,సమాజానికి ,పేద విద్యార్ధులకు ,మా విద్య సంస్థ కు ఉపయోగపడే కార్యక్రమాలను లక్ష్యాలు గా నిర్ణయించేము.


Objectives of SOFA:-
1.SALUR Govt.Jr.College ,High School లో చదివిన / చదువుచున్న top rankers కి ప్రతి సంవత్సరం CASH/MERIT AWARDS ఇవ్వడం .
2. పేద విద్యార్ధులకు NOTE BOOKS,TEXT BOOKS ఇవ్వడం .
3. Guidance & Counselling క్లాసులు నిర్వహించడం .
4. ఈరోజు మేము ఈ స్థితి లో ఉండటానికి కృషి చేసిన ఉపాధ్యాయులను ఎక్కడ వున్నా గుర్తించి , వారిని తగిన రీతి లో సత్కరించడం .
5. మెడికల్ క్యాంపులు , EYE DONATION క్యాంపులు నిర్వహించడం .
6. Govt.Jr.College ,High School కి అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించి , ప్రభుత్వ విద్యా సంస్థ లో చదివి ఉన్నత స్థితి కి వచ్చిన మేము ,ప్రభుత్వ విద్యే ఉత్తమ విద్య అని ప్రోత్సహించడం .
7. ఈరోజుకి కూడా కరెంటు సౌకర్యం లేని గిరిజన గ్రామాలకు SOLAR LAMP సౌకర్యం కల్పించడం .
8. మానవాళి కి ఆపద కల్గిస్తున్న PLASTIC ను నిరోధించే విధంగా ప్రచారం చేయడం .
9 . మొక్కల పెంపకం ప్రోత్సహించడం .
10. మా పూర్వ విద్యార్ధులలో ఆపదలో ఉన్నవారిని ఆదుకుని , వారికి మనోధైర్యం కల్గించడం

పై కార్యక్రమాలు చేయడానికి కావలసిన ఆర్ధిక వనరులని ఇవ్వాల్సింది గా , ఈ ONE - STEP సభ కి హాజరైన వారి నుండి , అడిగిందే తడవుగా , ఆ ఒక్క రోజే 2 లక్షలకి పైగా సేకరించి మా స్నేహితుల కార్యదక్షత ను నిరూపించుకున్నాము .అంతేగాక మా ప్రతీ సంవత్సర ఆదాయంలో కొంత SOFA నిధి గా జమ చేయుటకు నిర్ణయించి , కేవలం మా ఒక్క బ్యాచ్ తోనే కాకుండా ,మా జూనియర్స్ , సీనియర్స్ అందరి యొక్క సహకారం తీసుకునే దానికి కృషి చేస్తున్నాము .

పై కార్యక్రమాలను మొదట మా school/college నుండి ప్రారంభించి ,కాలక్రమేణా SALUR లో, చుట్టు ప్రక్కల అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు వ్యాప్తి చేయడానికి నిర్ణయించేము.

PAST ACTIVITIES:
1.JULY-2010 లో HIGH SCHOOL లో 10,000 రూ.ల తో , COLLEGE లో 7000 రూ.ల తో GROUND DEVELOPMENT చేసేము .
2. తే. 15-08-2010 నాడు Govt.High School/College లో SSC-2010 /inter-2010 లో top rankers కి CASH AWARDS ఇచ్చేము .పేద high school విద్యార్ధులకు note books ఇచ్చేము .
3. COLLEGE LIBRARY కి రూ. 6000 విలువ చేసే పుస్తకాలు ఇచ్చేము.
4. తే .27-12-2010 న మా పూర్వ గురువులు, తెలుగు మాస్టారు శ్రీ శర్మ గారికి SOFA వార్షిక సమావేశం లో ను, తే.28-02-2011 న మా పూర్వ గురువులు ,తెలుగు మాస్టారు శ్రీ R.M.S.శాస్త్రి గారికి నెల్లిమర్ల Govt.High School లో ను, తే .30-06-2011 న మా పూర్వ గురువులు శ్రీ M.A.BHATLU మాస్టారికి కురుపాం ప్రభుత్వ జూనియర్ కాలేజి లో ను తగిన రీతిన సత్కారములు చేసినాము .
5. SOFA చేసిన కార్యక్రమాలు ,పూర్వ విద్యార్ధుల వివరాలు , ఫోటోలతో వివరం గా www.sofa4all.in అను website ను నిర్వహిస్తునాము .

FUTURE ACTIVITIES:
1.2011 SSC/INTER top rankers కి cash awards ను 15-08-2011 నాడు ఇవ్వటం .
2. HIGH SCHOOL ప్రాంగణం లో వివేకానంద విగ్రహ ప్రతిష్ట చేయటం .
3. హై స్కూల్ పేద విద్యార్ధులకు NOTE BOOKS ఇవ్వటం .

విజ్ఞప్తి : ఈ విద్య సంస్థ లో చదివిన అందరు పూర్వ విద్యార్ధులు SOFA లో చేరి , మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి సహకరిస్తారని కోరుచున్నాము .SOFA కి సహకరించే మంచి మనసున్న పూర్వ విద్యార్ధులు sofa1989@gmail.com కి మెయిల్ చేయండి